మళ్లీ నటించాలని ఉంది.. కానీ, ఆ వార్త మాత్రం అబద్ధం
ప్రస్తుతం పెద్ద హీరోలు షూటింగుల్లో పాల్గొనడానికి నిరాకరిస్తున్నారు. మామూలు పరిస్థితి ఏర్పడిన తర్వాతే షూటింగ్ అని చెప్తున్నారు. పెద్ద హీరోలకు సంబంధించి మధ్యలో ఆగిపోయిన షూటింగ్‌ను కంటిన్యూ చేసే అవకాశం లేదు. కొ్త్త సినిమాలు ప్రారంభించే ఆలోచన ఎవరికీ లేదు. అయితే ఇప్పటికే ప్రకటించిన సినిమాలకు సంబంధించి మాత్రం రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమధ్యకాలంలో సూపర్‌స్టార్ మహేష్, పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న `సర్కారువారి పాట` చిత్రానికి చాలా ఎక్కువ అప్డేట్స్ వచ్చాయి. తాజాగా రేణు దేశాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై రేణు స్పందిస్తూ తాను ఎలాంటీ పాత్ర చేయట్లేదని, తాను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనని తెలియజేసింది.
ఈ వార్త సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా సర్క్యులేట్ అవుతుండడం వల్ల తనకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలియజేసింది. అయితే తను ఏ సినిమాలోనూ నటించడం లేదని స్పష్టం చేసింది. నిజంగా అంత పెద్ద సినిమాలో అవకాశం వస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని తెలియజేసింది. ఇటీవల ఓ టీవీ ఇంటర్య్వూలో తనకు మళ్లీ నటించాలని ఉందని తెలియజేసింది. దీన్ని బేస్ చేసుకొని ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తున్నాయని రేణు తెలిపింది. ఇక కుమారుడు అకీరా గురించి తెలియజేస్తూ `ఇప్పుడు అకీరాకు 16 ఏళ్లు. భవిష్యత్తులో అకీరా ఏ రంగాన్ని ఎంచుకున్నా తల్లిగా నా ప్రోత్సాహం ఉంటుంది. సినిమాల్లోకి రావాలనుకున్నా నేను అడ్డు చెప్పను` అంది.













