Renu Desai: రేణూ ఆశలన్నీ దానిపైనే

బద్రి(badri) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణూ దేశాయ్(renu desai), ఆ తర్వాత రైటర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, డైరెక్టర్ గా మారి తన లక్ ను పరీక్షించుకుంది. రేణూ మల్టీ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. సినిమాల్లో నటిస్తున్న టైమ్ లో హీరో పవన్ కళ్యాణ్(pawan kalyan) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణూ ఇద్దరు పిల్లలు పుట్టాక పవన్ నుంచి విడాకులు తీసుకుని యాక్టింగ్ కు దూరంగా ఉంటూ వచ్చింది.
మళ్లీ 20 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్, రవితేజ(raviteja) హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు(tiger nageswara rao) అనే మూవీతో తిరిగి నటనలోకి అడుగుపెట్టి ఆ సినిమాలో హేమలతా లవణం(hemalatha lavanam) అనే సోషల్ యాక్టివిస్ట్ రోల్ లో కనిపించింది. టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపవడంతో పాటూ ఆ సినిమాలో రేణూ చేసింది చాలా సీరియస్ క్యారెక్టర్ అవడం వల్ల ఆమె పాత్రకు, యాక్టింగ్ కు గొప్ప పేరైతే దక్కలేదు.
అయితే ఆ మూవీ ఫ్లాప్ అయినా రేణూకి అవకాశాలు మాత్రం వచ్చాయి. కానీ తనకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో రెండేళ్ల నుంచి రేణూ ఎలాంటి సినిమాలోనూ కనిపించలేదు. కాగా తాజాగా రేణూ ఓ సినిమాకు సైన్ చేసినట్టు చెప్పింది. అత్తా కోడళ్ల బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఓ కామెడీ మూవీలో రేణూ నటిస్తోందట. ఈ మూవీలో రేణూ ఓ హీరోయిన్ కు అత్తగా కనిపించనున్నట్టు కూడా చెప్పింది. ఈ కామెడీ మూవీ హిట్ అయితే మాత్రం తర్వాత రేణూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.