రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది
సినీ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. ఆ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. కాబోయే భర్తతో ఉంగరాలు మార్చుకొంటున్నప్పటి ఫొటోతో పాటు, తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటోల్ని పంచుకొన్నారామో. అయితే తనకు కాబయే భర్త వివరాల్ని కానీ, నిశ్చితార్థం ఎక్కడ జరిగిందనే విషయాన్ని కానీ ఆమె బయటపెట్టలేదు. తాను వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు రేణుదేశాయ్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆ విషయాన్ని ఖరారు చేశారు. పవన్‌కల్యాణ్ నుంచి విడిపోయిన రేణుదేశాయ్ కొంత కాలం పుణెలో పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. నిశ్చితార్థం సమయంలో రేణుదేశాయ్‌తో పాటు పిల్లలు అకీరా, ఆద్య ఉన్నారు. జీవితంలో సంతోషకరమైన దశని మొదలుపెట్టే సమయంలో నా పిల్లలు నా పక్కనే ఉండటం చాలా సంతోషాన్నిస్తోంది. వాళ్లు లేకపోతే నా సంతోషం పరిపూర్ణం కాదు అని ట్వీట్ చేశారు రేణుదేశాయ్. బాధ నుంచి కోలుకొనేందుకు, నాకు తోడుగా నిలిచిన నీ మనసుకు ధన్యవాదాలు అంటూ కాబోయే భర్తని ఉద్దేశించి ఇన్‌స్టగ్రామ్‌లో రాశారు రేణు.













