అకీరా ఇంట్రెస్ట్ ఏంటో చెప్పిన రేణూ
గత రెండు మూడు రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అరంగేట్రం గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై నెట్టింట రకరకాల కామెంట్స్ వినిపిస్తుండగా, రేణూ దేశాయ్ ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తూ ఉంది. తన కొడుక్కు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేనట్లు ఇన్‌డైరెక్ట్ గా చెప్పింది రేణూ. తాజాగా రేణూ ఇన్ స్టా లో ఓ రీల్ ను షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ రీల్ లో అకీరా టేస్ట్ ఏంటి? అతను ఎందులో రాణించాలనుకుంటున్నాడనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అకీరాకు మొదటి నుంచి మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉందని, దానివైపే అకీరా అడుగులేస్తున్నాడని, అందులో భాగంగానే యూఎస్ ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడని రేణూ స్పష్టం చేసింది.
పారిస్ స్టావాంజర్ ట్రిప్ హాలిడేస్ ను ముగించుకుని అకీరా ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అవడానికి అమెరికా వెళ్లాడని, అతడికిష్టమైన మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ బిజినెస్ కోర్సులో చేరడానికి వెళ్లాడు తప్పించి యాక్టింగ్ స్కూల్ కు వెళ్లలేదని రేణూ క్లారిటీ ఇస్తూ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అకీరా యాక్టింగ్ వైపు రాడా అని నిరాశ చెందుతున్నారు.













