అరవింద స్వామిని వద్దనుకోవడానికి రీజన్ అదే
అఖండ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఆ తర్వాత బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ముగించినట్లుగా సమాచారం అవుతోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ప్రస్తుతం కీలక పాత్రలకు నటీనటులను ఎంపిక చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అరవింద్ స్వామిని సంప్రదించారంటూ వార్తలొచ్చాయి. నిజంగానే దర్శకుడు, నిర్మాతలు ఈ సినిమా కోసం అరవింద్ స్వామిని సంప్రదించారని, కానీ ఒక ట్విస్ట్ ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
బాలయ్య సినిమాలో నటించేందుకు ఆ తమిళ సీనియర్ స్టార్ ఓకే చెప్పాడని, కానీ దానికి పారితోషికంగా భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అరవింద్ స్వామికి తెలుగులో ఎంత క్రేజ్ ఉన్నా, సినిమాకు ఎంత బజ్ వచ్చినా ఆయన అడిగిన రెమ్యూనరేషన్ మరీ ఎక్కువగా ఉండటంతో ఆయన్ను సెలెక్ట్ చేయాలనుకునే కోరికను విరమించుకున్నారని సమాచారట మేకర్స్.













