L2 Empuraan: సూపర్ హిట్ సినిమాకు కూడా రిలీజ్ కష్టాలు
మోహన్ లాల్(Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్(Pruthvi Raj sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన లూసిఫర్(Lucifer) సినిమా ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఎల్2: ఎంపురాన్(L2: Empuraan) తెరకెక్కింది. మార్చి 27న ఎల్2 రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ మేకర్స్ ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు.
డైరెక్టర్ పృథ్వీరాజ్ ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఎల్2 ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నిర్మాతలపైనే పడింది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇంకా ఎల్2కు బిజినెస్ అవకపోవడమే అంటున్నారు. ఓటీటీలు అడుగుతున్న రేట్‌కి, నిర్మాతలు చెప్తున్న రేట్‌కు చాలా తేడా ఉండటం వల్ల బిజినెస్ జరగడం లేదని తెలుస్తోంది.
దానికి తోడు నిర్మాణ సంస్థ లైకా(Lyca) కావడంతో వారి గత సినిమాల నష్టాల లావాదేవీలు పెండింగ్ లో ఉండటంతో బయ్యర్లు సరిగా రెస్పాండ్ అవట్లేదని తెలుస్తోంది. మరి ఎల్2 చెప్పిన డేట్ కు రిలీజవుతుందా అని రిలీజ్ డేట్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదంటున్నారట. ఏదేమైనా లూసిఫర్ లాంటి హిట్ సినిమా సీక్వెల్ గా ఇలాంటి పరిస్థితులు రావడం మాత్రం విచిత్రమే.













