సంక్రాంతి బరి లో రామ్ ‘రెడ్’
రామ్ ‘రెడ్’ చిత్రం సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ సంగీతం అందించారు. ఈ రోజే (శనివారం) సెన్సార్ పూర్తిచేసుకొని U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది RED మూవీ. నిజానికి ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, థియేటర్లలోనే విడుదల చేయాలనే సంకల్పంతో ఇన్నాళ్లూ ఎదురు చూసిన దర్శకనిర్మాతలు తాజాగా చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ మూవీలో ఉంటాయని నిర్మాత స్రవంతి రవికిశోర్ అన్నారు. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతినిస్తుందని ఆయన తెలిపారు.
క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేసింది. రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడం, యూట్యూబ్‌లో నెంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.’ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు.
నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘’ఈరోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది . ‘దేవదాసు’, ‘మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో… ఈ అంశాలన్నీ సినిమాలోఉంటాయి.’ఇస్మార్ట్ శంకర్’కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, ‘రెడ్’కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది. అన్ని థియేటర్స్ లోను ట్రైలర్ ప్రదర్శితమవుతూ ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది” అని అన్నారు.
నటీనటులు: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్ తదితరులు సాంకేతిక నిపుణులు: సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకత్వం: తిరుమల కిశోర్.













