రూమర్స్ పై స్పందించిన సందీప్ కిషన్…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ గా మైఖేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ మధ్య ఈ యంగ్ హీరో పై ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. గ్లామరస్ హీరోయిన్ రెజినా, సందీప్ కిషన్ లవ్ లో ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రెజీనా పుట్టినరోజు సందర్భంగా ” హ్యాపీ బర్త్డే పాపా, లవ్ యు ” అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేయడం జరిగింది. ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోని కూడా షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అన్న వార్తలకి మరింత బలం చేకూరింది.
అయితే తాజాగా సందీప్ కిషన్ ఈ రూమర్స్ పై స్పందించాడు. ” మేమిద్దరం కలిసి కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేశాం, రెజినా నా బెస్ట్ ఫ్రెండ్, మాది 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ” అని క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. సందీప్ కిషన్, రెజినా ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు, మా ఇద్దరిమధ్య ఎదో ఉందంటేనే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అని ఘాటుగా వారిద్దరి మీద వచ్చిన రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్.
ఇక కెరీర్ స్టార్టింగ్ లో ” రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, నక్షత్రం ” వంటి సినిమాల్లో జోడిగా నటించి టాలీవుడ్ లో ఒకప్పటి హిట్ పెయిర్ అనిపించుకున్నారు సందీప్ కిషన్, రెజీనా. దాదాపు ఇండస్ట్రీలో ఇద్దరి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే వీళ్ళ పరిచయం దగ్గరినుండి మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరి స్నేహం పై ఇలాంటి రూమర్స్ రావడంతో కాస్త అసహనంగానే ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ గా ఉన్న తరుణంలో రెజీనా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రిఫెరెన్స్ ఇస్తూ దూసుకుపోతుంది. అదే విధంగా రీసెంట్ గా మైఖేల్ సినిమాతో సందీప్ కిషన్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.













