ప్రేమలో పడ్డానంటున్న రెజీనా?
టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రెజీనాకు ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. పైగా వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. అవకాశాలు వస్తున్నాకానీ, ఎందుకో కొన్ని సినిమాలకు నో చెప్పడం షాక్ ఇస్తోంది. రెజీనా ఈ మధ్య సినిమాలు కూడా కావాలనే బాగా తగ్గించిందని సినీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఈ భామ స్పందిస్తూ, నటిని కావాలన్నది నా కోరిక అందుకే పరిశ్రమకు వచ్చాను. నటిగా నిరూపించుకున్నాను. కానీ ఈ పదేళ్ల కేరీర్లో ఎన్నో మలుపులు చూసాను. ఈ మధ్య నేను సినిమాలను తగ్గించానని అంటున్నారు. నిజమే దానికి కారణం ఈ మధ్యే నేను ప్రేమలో పడడం అనే పొరపాటువల్లే జరిగిందని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నా దృష్టి కెరీర్మీద వుందని, ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని, నేనేంటో నిరూపించుకుంటానని చెప్పింది. అంతా బాగానే వుంది కానీ ఈ అమ్మడికి ప్రేమలోకి దింపిన అతగాడు ఎవరా అన్నది తేలాల్సి వుంది మరి.













