రామ్ గోపాల్ వర్మకి రెడ్డి కమ్యూనిటీ నుండి వార్నింగ్
టాలీవుడ్ లో ది మోస్ట్ వాంటెడ్… డైరెక్టర్, క్రియేటర్… సెన్సేషనల్ డైరక్టర్.. టాలెంటెడ్ డైరక్టర్.. ఈ పేర్లన్నీ ఒకప్పుడు ఆర్జీవీ కి చెందిన బిరుదులు. అలా అందరూ పిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని, ఇప్పుడు వివాదాస్పద దర్శకుడిగా మాత్రమే పిలుస్తున్నారు. ఒకప్పుడు ఇండియిన్ సినిమాపైనే ఎఫెక్ట్ చూపించిన దర్శకుడు.. ఇప్పుడు కాంట్రవర్సీ సబ్జెక్టులు ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. కొందరి నిజజీవితాలనే కథలుగా మలచి సొమ్ము చేసుకుని సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలో మరిన్ని వివాదాలకు గురవుతున్నాడు వర్మ. ఆమధ్య కాపు, కమ్మలతో గొడవపడిన వర్మ.. ఇప్పుడు రెడ్లను కదిపాడు.. వారి ఆగ్రహానికి గురవుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ సంఘటన గురించి తెలిసిందే. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని వర్మ సినిమా తీస్తున్నాడు. ‘దిశ ఎన్ కౌంటర్’ పేరుతో ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు దీనిపైనే రెడ్డి సామాజికవర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దిశ సినిమా ఆపాలంటూ రామ్గోపాల్ వర్మకు రెడ్డి జేఏసీ వార్నింగ్ ఇచ్చింది. సినిమా ఆపకపోతే భౌతిక దాడులకైనా సిద్ధం అంటూ ప్రకటించింది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ట్రైలర్ రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా ఆపకపోతే వర్మ, నట్టికుమార్ ఇళ్లను ముట్టడిస్తామని.. తెలంగాణలో సినిమా రిలీజ్ కానివ్వమంటూ వర్మకు వార్నింగ్ ఇచ్చింది.సినిమా నిలిపివేయాలంటూ సెన్సార్ బోర్డుకు వినతిపత్రం కూడా సమర్పించారు. గతంలో వంగవీటి సినిమా తీసి కాపులు, రెడ్లతో వార్నింగ్ ఇప్పించుకున్నాడు. వారితో నువ్వా నేనా అనేంతగా వెళ్లాడు వర్మ. ఈసారి రెడ్డి జేఏసీ రంగంలోకి దిగింది. మరోవైపు దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వర్మ గతంలోలా రఫ్ గా రియాక్ట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరి.. రెడ్డి జేఏసీతో తలపడతాడా.. కామ్ గా ఉంటాడో వేచి చూడాలి.













