కల్కి ట్రైలర్ ఏయే రికార్డులను బ్రేక్ చేస్తుందో
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన దర్శకత్వంలో వస్తోన్న సినిమా కల్కి 2898ఏడి. ఈ నెల 27న కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, ప్రోమోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టనుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.
ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కల్కి పైన దేశవ్యాప్తంగా హైప్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ జూన్ 10న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. సినిమా కంటే ముందుగా వచ్చే ఈ ట్రైలర్ తోనే కల్కి వండర్స్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే కల్కి ట్రైలర్ ముందు రికార్డుల టార్గెట్స్ కొన్ని ఉన్నాయి. అందులో ముందుగా టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్. ఈ రికార్డు ప్రభాస్ సలార్ మూవీ మీద ఉంది. 3 నిమిషాల్లోనే సలార్ ట్రైలర్ ఈ రికార్డును బ్రేక్ చేయగా, భీమ్లా నాయక్ 4 నిమిషాల్లో ఆ రికార్డును అందుకుంది. ఈ రికార్డును కల్కి ఈజీగా బ్రేక్ చేసే ఛాన్సుంది. తర్వాత 24 గం.ల్లో హయ్యెస్ట్ వ్యూస్ రికార్డ్ గుంటూరు కారం ట్రైలర్ మీద ఉండగా సెకండ్ ప్లేస్ లో సలార్ ట్రైలర్ ఉంది. ఈ రికార్డును కూడా కల్కి బ్రేక్‌చేసే ఛాన్సుంది. ఇక 24 గంటల్లో హయ్యెస్ట్ లైక్స్ రికార్డ్ ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు ఉంది. సౌత్ మొత్తం మీద చూసుకుంటే ఈ రికార్డు లియో సినిమా ట్రైలర్ కు ఉంది. మరి ఈ రెండు రికార్డుల్లో కల్కి దేన్ని బ్రేక్ చేస్తుందన్నది చూడాలి.













