The Raja Saab: రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల కేరింతలతో “రాజా సాబ్” థియేటర్స్ మార్మోగుతాయి – డైరెక్టర్ మారుతి
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్” (Raja Saab) ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ తో ఈ సెలబ్రేషన్స్ ను బిగిన్ చేశారు మూవీ టీమ్. ఈ రోజు “రాజా సాబ్” సినిమా ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ను హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – రెబల్ ఫ్యాన్స్ “రాజా సాబ్” సినిమా కోసం ఎంత ఆకలిగా ఉన్నారో మాకు తెలుసు. ఈ సినిమా మీకు విందుభోజనంలా ఉంటుంది. ఈ సినిమాకు ప్రభాస్ గారు యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు, పాటలు చేస్తున్నప్పుడు, ఎంటర్ టైన్ మెంట్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు సెట్ లోనే ఉన్నా. ఆ సీన్స్ అన్నీ అదిరిపోతాయి. విదేశాల్లో పాటలు చిత్రీకరించినప్పుడు గడ్డకట్టే చలిలో కూడా ప్రభాస్ గారు డ్యాన్సులు చేశారు. అభిమానులకు కావాల్సింది, వాళ్లు ఇన్ని రోజులు మిస్ అయ్యింది ఎంత కష్టపడైనా “రాజా సాబ్”తో ఇవ్వాలి డార్లింగ్ అనే ప్రభాస్ గారు మాతో చెప్పేవారు. తను తినే లాంటి భోజనం యూనిట్ లో ఉన్న 150 మందికి పెట్టిస్తారు ప్రభాస్. ఆయన అమ్మలాంటి వారు. ఎలాంటి బేధాలు చూపించకుంటా మనమంతా ఒక్కటే అని నమ్మే వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది, డ్యూయెట్ ఉంది. ముగ్గురు హీరోయిన్స్ తో కాంబినేషన్ సాంగ్ ఉంది. ఇన్ని రోజులు ప్రభాస్ గారిని మనం ఎలాంటి సినిమాలో మిస్ అయ్యామో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మీరు థియేటర్స్ లో విసరాలని తెచ్చుకున్న కాగితాలు ఇంటర్వెల్ కే అయిపోతాయి. మళ్లీ వెళ్లి తెచ్చుకుంటారు. “రాజా సాబ్” సినిమా అంటే ప్రభాస్ గారిపై మారుతికి ఉన్న ఇష్టం, మారుతిపై ప్రభాస్ కు ఉన్న నమ్మకం. టీజీ విశ్వప్రసాద్ గారు ఎంతో గ్రాండ్ గా ఈ మూవీని రూపొందించారు. “రాజా సాబ్”తో పండక్కి వస్తాం, పండగ చేస్తాం. అన్నారు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – “రాజా సాబ్” రిలీజ్ కోసం మీ కంటే ఎక్కువగా మేము వెయిట్ చేస్తున్నాం. జనవరి 9న సినిమా వస్తుందా లేదా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా జనవరి 9న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాం. గ్లోబల్ గా అత్యధిక థియేటర్స్ లో లార్జెస్ట్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం. ఫస్ట్ డే అన్ని బాక్సాఫీస్ రికార్డులను “రాజా సాబ్” అధిగమిస్తుంది. కాస్త ఆలస్యమైనా మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో గ్రాండ్ గా రూపొందిస్తున్నాం. ఫైట్స్, సాంగ్స్, డ్యాన్సెస్, ఎంటర్ టైన్ మెంట్, హారర్, యాక్షన్, గ్రాండ్ విజువల్స్ అన్నీ ఉంటాయి. ఒక భారీ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రభాస్ గారిని గ్రూప్ ఆఫ్ డ్యాన్సర్స్ తో కలిసి చూసి చాలా రోజులైంది. మా సినిమాలో అలా గ్రూప్ డ్యాన్సర్స్ తో కొన్ని సాంగ్స్ రూపొందించాం. దాదాపు వెయ్యిమంది గ్రూప్ డ్యాన్సర్స్ తో రూపొందించిన రెబల్ సాబ్ సాంగ్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ గారు ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా మాదే కావొచ్చు. ఆయన స్వీట్ పర్సన్. ప్రభాస్ గారితో ఇంత బిగ్ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – మీ మొహాల్లో ఈ నవ్వు చూడటం కోసమే కష్టపడుతున్నాం. మా టీమ్ అంతా పడేది మామూలు కష్టం కాదు. ఈ సినిమాతో పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు ప్రభాస్ గారి కటౌట్ కు అది చాలా చిన్న మాట. మీ మనసుల్లోకి రెబల్ గాడ్ అని ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేనిప్పుడు ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. చిన్న కాలేజ్ లో చదివేవాడిని, అలాంటిది ఆయన నీకు టాలెంట్ ఉంది రమ్మంటూ తన యూనివర్సిటీలోకి అహ్వానించారు. నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ ఆయన యూనివర్సిటీలోకి వెళ్లాక ఆయనను అర్థం చేసుకుంటూ ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ప్రభాస్ గారి ఫొటో జేబులో ఉంటే ఎలాంటి వాడైనా టాప్ డైరెక్టర్ అయిపోతాడు. అందులో డౌట్ లేదు. కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే అందరినీ దగ్గర చేసుకుంటాడు. రెండేళ్లు ఆయనతో ట్రావెల్ చేస్తున్నానంటే నేను అదృష్టవంతుడిని అనుకుంటా. మీ కేరింతలతో “రాజా సాబ్” థియేటర్స్ మార్మోగుతాయి. నేను ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ చూస్తున్నా. మీ లాంటి అభిమానులను ఊహించుకునే వర్క్ చేస్తున్నా. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ గారు ఇలాంటి పాట చేశారంటే అది కేవలం మన కోసమే. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఫస్ట్ మనమంతా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి పండక్కి “రాజా సాబ్” సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రభాస్ గారు ఇచ్చిన కంఫర్ట్, ప్రోత్సాహం వల్లే ఇంత బాగా మూవీని రూపొందించగలిగాను. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్, వారి కెమిస్ట్రీ స్క్రీన్ మీదే చూడాలి. అభిమానులు నాపై పెట్టుకున్న హోప్స్ కు ఒక పర్సెంట్ ఎక్కువే ఇస్తా. మేము ఒక్కొక్కటిగా ఇవ్వబోయో కంటెంట్ తో మీరంతా రిలీజ్ ముందు వరకు రెబల్ ఆరాలో ఉంటారు. అన్నారు.






