చంటబ్బాయ్ తిరిగొచ్చాడు…
మెగాస్టార్ చిరంజీవి మీసం తీయడం అనేది చాలా చాలా అరుదు. ఆయన మీసం తీసేసి కనిపించిన ఏకైక సినిమా చంటబ్బాయ్ అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేసింది లేదు. ఇటీవల అయితే తరచుగా గెడ్డం కూడా పెంచుతూ కనిపిస్తున్నారు. అలాంటి మెగాస్టార్ అకస్మాత్తుగా మీసం, గెడ్డం తీసేసి క్లీన్ షేవ్‌తో ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సందడి చేస్తోంది. ఈ ఫొటోలో ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్న కొత్త లుక్ లో ఆయన బ్లూ టి షర్ట్ ధరించిన పిక్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటో చూస్తే ఆయన వయసు 63 ఏళ్ళు అంటే నమ్మకపోగా దాన్ని తిరగేసి 36 అన్నా నమ్మేంత యంగ్ గా కనిపిస్తున్నారు చిరు. ఇప్పుడున్న కుర్ర స్టార్ హీరోలను మించి యంగ్ గా కనిపిస్తున్నారు ఆ లుక్‌లో అంటూ కామెంట్లు, కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు నెటిజన్స్. అయితే ఇంతకీ అసలు ‘చిరు ఎందుకు ఇలా మీసం తీసేసి కొత్త లుక్ లో కనిపించడానికి కారణం ఏమిటి?
బోర్ కొట్టి మీసం కట్…
ఆయన కొత్త సినిమాలో పాత్ర కోసం ఇలాంటి అవతారమెత్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదేమీ కాదని చిరంజీవి అంటున్నారు. “లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీ ఉండడంతో చాలా బోర్ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు షూటింగ్ కూడా మొదలుపెట్టలేని పరిస్థితి. ఈ ఖాళీ టైములో ఏదైనా కొత్తగా ట్రై చెయ్యాలి అనిపించింది. అందుకే ఇలా మీసం తీసేసి కొత్త లుక్ ట్రై చేశాను. ఇది సినిమా కోసం కాదు… జస్ట్ క్యాజువల్ గా..అంతే” అంటూ చెబుతున్నారాయన. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయ్యింది. లాక్ డవున్ పరిస్థితులు సద్ధుమణిగాక త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ను పునః ప్రారంభించి… వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని ‘ఆచార్య’ టీం ప్రయత్నిస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.













