హనుమాన్ రిలీజ్ డేట్ వెనుక అసలు రీజన్
టాలీవుడ్ లో అసలు సీజన్ సంక్రాంతి సీజనే. దానికి ఇంకో నాలుగు నెలల టైమే ఉండటంతో సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమాలన్నీ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా సంక్రాంతి రేసులో తేజ సజ్జ హనుమాన్ కూడా ఉంది. జనవరి 12 న సినిమా రిలీజ్ అవుతుందని ఎప్పటికప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా వినాయక చవితి సందర్భంగా ఓ స్పెషల్ లుక్‌ని రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. హనుమాన్ రిలీజ్ కానున్న రోజే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. గుంటూరు కారం చెప్పిన టైమ్ కు వస్తుందని నిర్మాతలు ఎంత గట్టిగా చెప్తున్నా సరే అదే రోజున హనుమాన్ సినిమా రిలీజ్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది.
గుంటూరు కారం సినిమా తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాలతో పాటూ ఓవర్సీస్లో కూడా బిజినెస్ జరగనుంది. తమిళంలో పట్టించుకోరు. మలయాళంలో అసలు మార్కెటే ఉండదు. కాబట్టి తెలుగు రాష్ట్రాలను లైట్ తీసుకున్నా మిగిలిన దగ్గర హనుమాన్ మంచి టాక్ తెచ్చుకుంటే అక్కడ ప్రభంజనం సృష్టించే ఛాన్సుంది.
తేజ సజ్జ చిన్న హీరోనే అయినా సినిమాలో ఉన్న గ్లోబల్ కంటెంట్‌ను నమ్మి సంక్రాంతి సీజన్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మహేష్ సినిమాకు పోటీగా. నార్త్ లో హనుమంతుడిని ఆరాధించే వారు ఎక్కువ కాబట్టి అక్కడ ఈ సినిమాపై కచ్ఛితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీఎఫెక్స్ విషయంలో లేట్ అవుతున్నా సరే ఎక్కడా నెగిటివిటీ ఉండకూడదని ప్రశాంత్ వర్మ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.













