అందుకే సినిమా ఈవెంట్లకు రాను: వెన్నెల కిషోర్
టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. వారిలో వెన్నెల కిషోర్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మొదట్లో సాఫ్ట్ వేర్ అయిన కిషోర్, తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా సక్సెస్ అయ్యాడు. అయితే కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వెన్నెల కిషోర్, సినిమా ఫంక్షన్స్ కు రాడని ఎంతో నెగిటివిటీని మూట గట్టుకున్నాడు.
ఈ విషయంలో ఎంతోమంది హీరోలు స్టేజ్ మీద వెన్నెల కిషోర్ పై సెటైర్స్ కూడా వేశారు. అయితే వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ రాకపోవడానికి గల కారణాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. సినిమా ఈవెంట్ లో వచ్చిన గెస్టులు తనని పొగడటం తనకు కంఫర్టబుల్ గా అనిపించదట.
ఎవరైనా తమ గురించి మాట్లాడితే థాంక్స్ చెప్తాం కానీ అదే పనిగా పొగుడుతూ ఉంటే వారి మాటలకు ఎలా రెస్పాండ్ అవాలి? ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలనేది కూడా తనకు తెలియదని, ఆ టైమ్ లో తనకు టెన్షన్ వచ్చేస్తుందని చెప్పాడు వెన్నెల కిషోర్. ఈ కారణంతోనే తాను సినిమా ఫంక్షన్స్ కు రానని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి స్క్రీన్ పై నవ్వులు పూయించే వెన్నెల కిషోర్ కు స్టేజ్ ఫియర్ ఉందన్న విషయాన్ని స్ట్రయిట్ గా చెప్పాడు. కానీ ఈ విషయంతో సినిమా ఫంక్షన్లకు డుమ్మా కొడితే ఎలా మెల్లిగా అలవాటు చేసుకోవాలి బాసూ అని కొందరు వెన్నెల కిషోర్ కు సలహాలిస్తున్నారు.













