SSMB29 లేటుకు కారణమదేనా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాతి సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ సినిమా నుంచి అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. నెక్ట్స్ ఇయర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ సినిమాపై రాజమౌళి ఎందుకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదనే విషయపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థను భాగస్వామిగా చేయాలనుకుంటున్నాడట. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళిపై ఇప్పుడు హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఫోకస్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మహేష్29 సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో జక్కన్న డిస్కషన్స్ చేస్తున్నాడట. ఎవరో ఒకరు ఫైనలై ఈ సినిమా నిర్మాణానికి ముందుకొస్తే హాలీవుడ్ లెవెల్ లో సినిమాకు ఫోకస్ దొరుకుతుందని రాజమౌళి ప్లాన్. ప్రస్తుతం ఈ విషయంలో డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తోంది. ఈ డీల్ ఓకే అయితే తర్వాత హాలీవుడ్ యాక్టర్లను కూడా రాజమౌళి ఇందులో భాగం చేసి సినిమా మార్కెట్ ను పెంచాలని చూస్తున్నాడట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్సుందని ఫిల్మ్ నగర్ వర్గాలంటున్నాయి.













