టిల్లూ స్క్వేర్ నుంచి శ్రీలీల తప్పుకోవడానికి రీజన్ అదేనా?
రీసెంట్ గా రిలీజైన టిల్లూ స్వ్కేర్ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. డీజే టిల్లూ స్టోరీకి కొనసాగింపుగా రాకపోయినా క్యారెక్టర్స్ ను ఆ సినిమాకు లింక్ చేసిన విధానం ఇంట్రెస్ట్ ను కలిగిస్తోంది. హీరో సిద్దూ జొన్నలగడ్డ టైమింగ్ తో పాటూ అన్నీ ట్రైలర్ ను బాగా హైలైట్ చేశాయి. అన్నింటికంటే ట్రైలర్ లో అనుపమను చూశాక అందరూ అవాక్కయ్యారు.
వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ శ్రీలీల. కొన్ని సీన్స్ షూటింగ్ కూడా జరిగాయి. కానీ ఈ సినిమాను తాను చేయలేనని తప్పుకుంది. తర్వాత ఆ ప్లేస్ లోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. అనుపమ కూడా ముందు ఈ సినిమాకు ఓకే చెప్పలేదు. కానీ చివరకు ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అయితే ట్రైలర్ చూశాక ఈ సినిమా నుంచి శ్రీలీల ఎందుకు తప్పుకుందో అర్థమవుతుంది. లాంగ్ లిప్ లిక్స్ తో పాటూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో నటించడానికి శ్రీలీల ఇబ్బంది పడి ఉంటుంది. ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ కు ఓకే చెప్పని శ్రీలీల, ఈ రేంజ్ లో నటించడానికి భయపడే టిల్లూ స్క్వేర్ నుంచి తప్పుకుందని అందరూ అంటున్నారు. టిల్లూ స్వ్కేర్ రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీల తను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం కాబట్టి పెద్దగా ఫీలయ్యే ఛాన్సు కూడా లేదు.













