వేణు సినిమా క్యాన్సిల్ అవడానికి కారణమదేనా?
దిల్ రాజు బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా బలగం డైరెక్టర్ వేణు దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్లు దిల్ రాజు ఓ ఈవెంట్ లో చెప్పాడు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ముందుడుగు పడలేదు. తాజాగా నాని- బలగం వేణు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తోంది. వేణు రాసుకున్న కథ గ్రామీణ నేపథ్యంలో డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఆ కథ దసరా సినిమాకు, త్వరలోనే శ్రీకాంత్ ఓదెలతో నాని చేయబోయే సినిమాలోని పాయింట్ కు దగ్గర పోలిక ఉండటంతో పాటూ ఫైనల్ నెరేషన్ విషయంలో కూడా వేణు, నానిని ఇంప్రెస్ చేయలేకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది.
వేణు రాసుకున్న పీరియాడిక్ డ్రామాలో 40 ఏళ్ల కిందట ఓ గ్రామంలో జరిగిన నిజమైన లవ్ స్టోరీని స్పూర్తిగా తీసుకున్నాడని టాక్. వయొలెన్స్ తో పాటూ ఎమోషన్ కూడా చాలా ఎక్కువగా ఉందని, అందుకే ఇది తనకు సెట్ అవదని నాని వదులుకున్నాడేమో అంటున్నారు. ఏదేమైనా వేణుకి నానితో మంచి ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది. బలగం తర్వాత ఎలాగైనా సరే పెద్ద హీరోతో సినిమా చేయాలనుకుంటున్న వేణు మరి ఏ హీరోతో ఎల్లమ్మను ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.













