కన్నప్ప సైలెన్స్ వెనుక కారణమిదే
మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న కన్నప్ప(kannappa) సినిమా ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు. డిసెంబర్ లో రిలీజ్ అని గతంలో అన్నారు కానీ గేమ్ ఛేంజర్(game changer) ఆ టైమ్ కే వస్తుందని తెలిసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా పడింది. దీంతో ఆ స్లాట్ ఖాళీ అయింది. కానీ కన్నప్ప టీమ్ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
దీంతో ఆ టైమ్ కు రాబిన్ హుడ్(Robbinhood), సారంగపాణి జాతకం(sarangapani jathakam) లాంటి సినిమాలు ఆ స్లాట్స్ ను బుక్ చేసుకుంటున్నాయి. అయితే కన్నప్ప టీమ్ లేట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయట. ఎంతో ప్రిస్టీజియస్ గా రూపొందుతున్న కన్నప్ప బిజినెస్ ను కూడా విష్ణు అదే రేంజ్ లో ఆశిస్తున్నాడట. ప్రభాస్(prabhas), మోహన్ లాల్(mohanlal), అక్షయ్ కుమార్(akhsay kumar) లాంటి స్టార్లను పెట్టుకుని కూడా తమ సినిమాను తక్కువ రేట్లకు అమ్మే ఉద్దేశంలో విష్ణు ఏ మాత్రం లేడట.
కానీ సినిమా ఎలా ఉంటుందోననే డౌట్ మాత్రం బయ్యర్లలో ఉంది. టీజర్ కు కూడా మిశ్రమ ఫలితమే వచ్చింది. వీటన్నింటినీ అధిగమించి సినిమాకు బజ్ బాగా పెరిగి మంచి బిజినెస్ జరగాలంటే ట్రైలర్ తో గట్టిగా సమాధానం చెప్పాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లకు కన్నప్పపై మంచి నమ్మకం ఏర్పడుతుంది. కేవలం క్యాస్టింగ్ పైనే మార్కెటింగ్ చేయాల్సి ఉండటం వల్లే కన్నప్ప రిలీజ్ డేట్ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ పూర్తయి కుదిరితే డిసెంబర్, జనవరిలో లేదంటే శివరాత్రికి కన్నప్ప విడుదలయ్యే ఛాన్సుంది.













