ఓజీ అసలు స్టోరీ ఇదేనట
వరుస సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్లో ఓజీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్‌కు ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మార్కెట్ లో డిమాండ్ రోజురోజుకీ బాగా పెరుగుతుంది.
ఓజీ నుంచి ఇప్పటి వరకు జస్ట్ టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. ఆ టీజర్ తోనే సినిమాకు ఊహించని విధంగా క్రేజ్ పెరిగింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిగా ముంబై నేపథ్యంలోనే ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి చాలా రకాల లీకులు కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా అసలు కథ ఇదే అంటూ ఓ టాక్ నడుస్తుంది. ఓజాస్ గంభీర అనే టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడ చిక్కుకునిపోతాడు. ఆ తర్వాత అతను కొన్ని కారణాల వల్ల గ్యాంగ్‌స్టర్ గా మారాల్సి వస్తుంది. అలా అతనికి క్రైమ్ మాఫియాలతో సంబంధాలేర్పడి అక్కడే కింగ్ గా ఎదుగుతాడు. ఆ గొడవల్లో తన సన్నిహితులను, ఫ్యామిలీని కోల్పోతాడు.
తర్వాత ప్రతీకారం కోసం విలన్స్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనేందుకు రెడీ అవుతాడు. ఆ తర్వాత అతని లైఫ్ ఎలా మారుతుంది? అసలు ఓజీ ఏ విధంగా గ్యాంగ్ స్టర్‌గా మారతాడనేది సినిమాలో చాలా హైలైట్ గా చూపించబోతున్నాడట సుజీత్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కథ నిజంగా ఇదే అయితే ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.













