Toxic: యష్ సినిమాకు రీషూట్స్?
కెజిఎఫ్(KGF) సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న యష్(Yash) తన తర్వాతి సినిమాకు చాలా గ్యాప్ తీసుకుని మరీ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) తో టాక్సిక్(Toxic) సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా యష్ బర్త్ డే సందర్భంగా ఓ టీజర్ ను రిలీజ్ చేశారు.
రీసెంట్ గా టాక్సిక్ కు సంబంధించి నెల రోజుల పాటూ ముంబై లో ఓ షెడ్యూల్ జరిగింది. తీరా నెల రోజుల తర్వాత ఫుటేజ్ చూసుకున్న యష్ కు అది సంతృప్తినివ్వకపోవడంతో ఆ నెల రోజులు తీసిన ఫుటేజ్‌ను పక్కనేసి ఇప్పుడు రీషూట్ కు వెళ్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ నెల రోజులు షూటింగ్ కు పెట్టిన ఖర్చు, డైరెక్టర్ పడ్డ కష్టం, నిర్మాత పెట్టిన డబ్బంతా వృధానే.
అందుకే భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు ఎంత పెద్ద హిట్లుగా నిలిచినా నిర్మాతలకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. ఇదిలా ఉటే ఈ సినిమాలో యష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తుండగా, యష్ కు సోదరి పాత్రలో లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) కనిపించనుంది. ఈ సినిమాలో యష్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.













