Tollywood: రీరిలీజులతో నవంబర్ బిజీబిజీ
టాలీవుడ్ లో ఈ మధ్య రీరిలీజులు బాగా ఎక్కువైపోయాయి. మొదట్లో స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా మొదలైన ఈ ట్రెండ్ తర్వాత్తర్వాత మరీ ఎక్కువైంది. అయితే ఈ రీరిలీజుల్లో మొదట్లో హిట్ సినిమాలు, క్లాస్ స్టేటస్ తెచ్చుకున్న మూవీస్ రీరిలీజైతే తర్వాత్తర్వాత ఫ్లాపు సినిమాలు, కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీరిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.
కాగా ఈ నెలలో కాంత(kantha), ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king thaluka) తప్ప చెప్పుకోదగ్గ రిలీజులేమీ లేకపోవడంతో పాత సినిమాలే మళ్లీ రీరిలీజవుతున్నాయి. అందులో భాగంగానే నాగార్జున(nagarjuna)- రామ్ గోపాల వర్మ(Ram gopal varma)ల శివ(Shiva) 4కె డాల్బీ అట్మాస్ తో నవంబర్ 14న రీరిలీజ్ కానుంది. ఆ తర్వాత ఒక రోజుకు అంటే నవంబర్ 15కి ప్రభుదేవా(Prabhudeva) దర్శకత్వంలో సిద్దార్థ్(Siddharth) హీరోగా వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా(nuvvosthanante nenoddhantana) రాబోతుంది.
తర్వాత వారం నవంబర్ 21న మెగాస్టార్ కొదమసింహం(kodamasimham) రీరిలీజ్ కానుండగా, ఆ తర్వాత రోజు నవంబర్ 22న కార్తీ(karthi) ఆవారా(Awaara) మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 28న సూర్య(suriya) సికందర్(Sikandar) ను రీఎడిట్ చేసి ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియెన్స్ ఇచ్చి మెప్పిస్తామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. ఇక నవంబర్ 29న మహేష్ బాబు(mahesh babu) బిజినెస్ మ్యాన్(Business man) రీరిలీజవుతుంది. ఏదేమైనా ఈ నెలంతా వరుస రీరిలీజులతో చాలా బిజీగా మారనుందన్నమాట.







