చరణ్17 కథా నేపథ్యం ఏంటంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన గుడ్ న్యూస్ రెండ్రోజుల ముందే వచ్చేసింది. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో చరణ్ 17వ సినిమా ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. వాస్తవానికి ఈ అనౌన్స్మెంట్ మార్చి 27న చరణ్ బర్త్ డే రోజున రావాల్సింది. కానీ విషయం లీకవడంతో మంచి టైమ్ చూసి అనౌన్స్ చేసేశారు.
రంగస్థలం సినిమాతో ఈ కాంబో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుని కొత్త చరిత్రను సృష్టించిన ఈ కాంబో ఈసారి ఎలాంటి కథను చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, సుకుమార్ ఈసారి పల్లెటూరి నేపథ్యాన్ని తీసుకోవడం లేదట.
యాక్షన్ జానర్ వైపు అడుగులేస్తున్నాడని, 1 నేనొక్కిడినే టైమ్ లో జరిగిన తప్పులను మైండ్ లో ఉంచుకుని పక్కా కమర్షియల్ మూవీని ప్లాన్ చేశాడట. బడ్జెట్ కూడా మైత్రీ బ్యానర్ లోనే చాలా భారీగా ఉండబోతుందట. కాబట్టి ఈ సినిమా విషయంలో ఎన్నైనా అంచనాలు పెట్టుకోవచ్చన్నమాట. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న సుకుమార్, అది పూర్తవగానే చరణ్17 సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేయనున్నాడు. 2026 రిలీజ్ లక్ష్యంగా మిగిలిన ప్రణాళికలను రెడీ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.













