చరణ్ తో సుకుమార్ మళ్లీ అదే తరహాలో!
ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప2 సినిమా చేస్తున్న సుకుమార్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు దాని పనుల్లోనే బిజీగా ఉండనున్నాడు. పుష్ప2 అయిపోయిన వెంటనే సుకుమార్ తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటికే చరణ్ తో సుకుమార్ తన తర్వాతి సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. చరణ్ 17వ సినిమా సుకుమార్ తో చేయబోతున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది.
వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో కొత్త సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే చరణ్ తో చేసే సినిమా కోసం సుకుమార్ రీసెంట్ గానే కథను లాక్ చేసుకున్నాడట. సుకుమార్ చెప్పిన లైన్ కు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా నెట్టింట వినిపిస్తోంది.
చరణ్ ను సుకుమార్ మరోసారి చిట్టిబాబు లాంటి పాత్రలోనే చూపించాలని డిసైడ్ అయ్యాడట. దానికి తగ్గట్టే సుకుమార్ కథను రెడీ చేసుకున్నాడని టాక్. అయితే మొదట్లో ఈ సినిమా రంగస్థలంకు సీక్వెల్ అన్నారు కానీ కొత్త కథతోనే సుకుమార్ చరణ్ కలిసి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్న చరణ్, తర్వాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్.













