RC16 కోసం పెద్ద ప్లాన్ వేసిన బుచ్చిబాబు
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నెలల తరబడి లేటవుతూనే వస్తుంది. ఇక రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటివరకు నిర్మాత అయిన దిల్‌రాజుకే క్లారిటీ లేదు. ఇండియన్2 సినిమా రిలీజ్ డేట్ ఆధారంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఉంటుంది.
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ సినిమా కోసం చాలా పెద్ద ప్లాన్ ను బుచ్చి బాబు వేసినట్లు అనిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్ డ్రామా కోసం ఏకంగా మూడు వందల కోట్లు బడ్జెట్ పెట్టనున్నారట నిర్మాతలు.
విలన్ గా విజయ్ సేతుపతిని ఇప్పటికే లాక్ చేశారని తెలుస్తోంది. తనకి ఉప్పెన సినిమాతో మంచి రోల్‌ని ఇచ్చిన బుచ్చిబాబు, ఈ సినిమాలో దానికి మించిన పాత్రను ఇవ్వడంతో సేతుపతి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయకు ఒక కీలక పాత్ర ఇచ్చారని, రమ్యకృష్ణ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో లయ ఈ సినిమాలో కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది.
వీటన్నింటికీ తోడు ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. రీసెంట్గా ఈ విషయాన్ని రెహమానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకోవడంతో అందరికీ డౌట్స్ తీరిపోయాయి. ఈ ఏడాది చివరకు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని బుచ్చిబాబు చాలా పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది. మరి చూడాలి చివరకు ఏమవుతుందో!













