RC16 స్క్రిప్ట్ కోసమే భారీ ఖర్చు
రామ్ చరణ్(ram Charan) హీరోగా ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు(buchibabu) దర్శకత్వంలో రానున్న RC16 మీద అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ అంతా గేమ్ ఛేంజర్(Game changer) కంటే ఎక్కువగా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్(Jhanhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్(Sivaraj Kumar) ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కథను పూర్తి చేయడానికే సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఎంతో ఎక్స్పీరియెన్స్డ్ రైటర్స్ టీమ్ పనిచేస్తుందట. సీనియర్ రైటర్లంతా కలిసి స్క్రిప్ట్ ను మరింత సాన పెడుతుందట.
ఈ నెలలో షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో దానికంటే ముందే స్క్రిప్ట్ మొత్తాన్ని పక్కాగా రెడీ చేసి షూటింగ్ కు వెళ్లాలని మేకర్స్ ప్లాన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సినిమా కోసం మూడు సాంగ్స్ ను కంపోజ్ చేశారట. ఈ సినిమాలో చరణ్ చాలా కొత్తగా కనిపించనున్నాడని, అతని పాత్రను బుచ్చిబాబు ఎంతో స్పెషల్ గా డిజైన్ చేశాడని సమాచారం.













