RC16: ఆర్సీ16 వార్తలన్నీ పుకార్లే!
గేమ్ ఛేంజర్(Game changer) తర్వాత రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 16వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్కు రీసెంట్ గా చిత్ర యూనిట్ కొంచెం బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే తర్వాతి షెడ్యూల్ మొదలు కానుంది.
గేమ్ ఛేంజర్తో డిజాస్టర్ అందుకున్న చరణ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఈ మూవీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాగైనా ఈ సినిమా షూటింగ్ ను ఆగస్ట్ లోపు పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ తీసుకున్న ఆర్సీ16(RC16) చిత్ర యూనిట్ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉందట.
టైటిల్ ను ఫిక్స్ చేసి మార్చిలో చరణ్ పుట్టిన రోజు కానుకగా అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ మూవీకి ఫలానా టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆర్సీ16కు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేయలేదని, కేవలం కొన్ని టైటిల్స్ ను మాత్రమే పరిశీలిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. దీంతో ఆర్సీ16 టైటిల్ విషయంలో ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. మొత్తానికి చరణ్ బర్త్ డే కు ఆర్సీ16 నుంచి అప్డేట్ వస్తుందన్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది.













