RC16: చరణ్- బుచ్చిబాబు సినిమాలో నెక్ట్స్ లెవెల్ ఫ్లాష్ బ్యాక్
రామ్ చరణ్(Ram charan) నుంచి సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్(Game Changer) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో మెగా ఫ్యాన్స్ తమ ఆశలన్నింటినీ చరణ్ చేయబోయే తర్వాతి సినిమా పైనే పెట్టుకున్నారు. అయితే చరణ్ తన తర్వాతి మూవీని బుచ్చిబాబు సాన(Buchi Babu sana) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఆర్సీ16(RC16) కోసం చరణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకార, గేమ్ ఛేంజర్ సినిమాలో లానే ఆర్సీ16లో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడని, అందులోని ఓ పాత్రలో నార్మల్ గానే కనిపించనున్నప్పటికీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర కోసం మాత్రం 10 కేజీల బరువు తగ్గనున్నాడట.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) తో పాటూ వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas), సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) కలిసి సంయుక్తంగా నిర్మించనుంది. ఆర్సీ16కు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్(Siva Rajkumar) కీలక పాత్రలో నటించనున్నాడు.













