RC16: ఆర్సీ16 అవన్నీ రూమర్లేనట!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆర్సీ16(Rc16). స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే బుచ్చిబాబు రణ్బీర్ కు కథ చెప్పాడని, రణ్బీర్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని నెట్టింట వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆర్సీ16లో రణ్బీర్ ఎలాంటి పాత్ర చేయడం లేదని సమాచారం. కానీ సినిమాలో కథకనుగుణంగా 5 నిమిషాలుండే స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందట. ఆ క్యారెక్టర్ ను ఎవరైనా బాలీవుడ్ హీరోతో చేయించాలనేది బుచ్చిబాబు ప్లాన్.
అయితే ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఆ పాత్ర కోసం ఎవరినీ కలిసింది లేదని సమాచారం. అంతకాదు ఆర్సీ16లో యానిమల్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్(Bobby Deol) నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆర్సీ16పై హైప్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.













