RC16: ఆర్సీ16కు ఆలస్యం తప్పదా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్(Game Changer) ప్రమోషన్స్ కోసం ఆర్సీ16 షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అయితే ఆర్సీ16పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Sivraj kumar) కీలక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. ఇంకా ఆయన సెట్స్ లో అడుగు కూడా పెట్టలేదు. అయితే శివన్న రీసెంట్ గా ఓ ముఖ్యమైన సర్జరీ కోసం అమెరికా వెళ్లాడు. ఈ నెల 24న ఫ్లోరిడాలో ఆయనకు ఆపరేషన్ జరగనుంది. దీంతో శివన్న(Sivanna) ఆరోగ్యం పట్ల అందరూ ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తన ఆరోగ్యం గురించి లేనిపోని ప్రచారాలు చేసి ఎవరినీ కంగారు పెట్టొద్దని శివన్న అందరినీ కోరాడు. ఆపరేషన్ తర్వాత కొన్నాళ్ల పాటూ రెస్ట్ తీసుకుని తర్వాతే శివన్న ఇండియాకు రానున్నాడు. ఎంతలేదన్నా ఫిబ్రవరి వరకు శివన్న రెస్ట్ లోనే ఉంటాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆర్సీ16తో పాటూ 45 టైటిల్ తో ఓ మూవీ, సప్తసాగరాలు దాటి(Sapta saagaralu daati) డైరెక్టర్ హేమంత్ రావు(Hemanth Rao)తో ఓ సినిమా ఉన్నాయి. కాబట్టి చరణ్ టీమ్ కు షెడ్యూల్స్ పరంగా కొన్ని మార్పులు తప్పేలా కనిపించడం లేదు.













