మ్యూజిక్ సిట్టింగ్స్ ప్లాన్ లో బుచ్చిబాబు
చేసిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సాన. అంతేకాదు సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆ సినిమా వచ్చి చాలా కాలమవుతున్నా బుచ్చిబాబు నుంచి ఇప్పటివరకు మరో సినిమా వచ్చింది లేదు. ఉప్పెన సక్సెస్ కావడంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో మంది నిర్మాతలు ఆసక్తి చూపించినప్పటికీ బుచ్చిబాబు మాత్రం తన రెండో సినిమా చేస్తే పాన్ ఇండియా సినిమానే చేయాలని పట్టుబట్టి కూర్చుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నారు. కానీ అది సెట్ అవలేదు. ఫైనల్ గా రామ్ చరణ్ తో బుచ్చిబాబు తన రెండో సినిమాను సెట్ చేసుకున్నాడు. RC16 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పట్టనుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను బుచ్చిబాబు మొదలెట్టేశాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా బుచ్చిబాబు ముందే స్టార్ట్ చేసినట్లు సమాచారం. బుచ్చిబాబు ముందు నుంచి ఈ సినిమాకు రెహమాన్ కావాల్సిందే అని కంకణం కట్టుకోవడంతో నిర్మాతలు ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ సినిమా ఓకే చేయించుకున్నారు. తర్వాత రెహమాన్ ఎప్పుడు బిజీ అవుతాడో తెలీదు కాబట్టి ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు ముందే ఈ సినిమాకు ట్యూన్స్ రెడీ చేయించుకునే పనిలో ఉన్నాడట బుచ్చిబాబు.
ఎలాగూ ఈ సినిమా స్టార్ట్ అయ్యాక బుచ్చిబాబు కూడా బిజీ అవుతాడు కాబట్టి ఇప్పుడే కుదిరినంత వరకు సాంగ్స్ చేయించుకోవాలనుకుంటున్నాడట. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగు సినిమాకు పనిచేస్తుండటంతో ఈ సినిమా మ్యూజిక్‌పై భారీ అంచనాలే ఉంటాయి. ఈ నవంబర్ లేదా డిసెంబర్లో సినిమాను మొదలుపెట్టి, 2025 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













