రామ్ చరణ్- శంకర్ టైటిల్ అదేనా?
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు జోరుగా లీకులు అందుతున్నాయి. కానీ వాటిలో ఏదీ అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. అప్పుడెప్పుడో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తప్పించి, ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫో వచ్చింది లేదు.
మార్చి 27 చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో టైటిల్ లాంచ్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని భాషలకు సరిపడేలా ఒకే టైటిల్‌ను ఈ సినిమాకు లాక్ చేసినట్ల సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ సినిమాకు సీఈఓ అనే టైటిల్‌ను చిత్ర బృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. సీఈఓ టైటిల్‌తో పాటూ దానికి సరిపోయే క్యాప్షన్ ని కూడా పెట్టనున్నారట.
ఈ టైటిల్ ఇదే ఫిక్స్ చేస్తారా లేక వేరే టైటిల్ ఏదైనా కన్ఫర్మ్ చేస్తారా అనేది తెలియాల్సింది ఉంది. ప్రస్తుతానికైతే ఈ టైటిల్‌ను టాప్ లిస్టులో పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఏ టైటిల్ పెట్టాలనేది ఫిక్స్ అవ్వనున్నారట. పోస్టర్ తో పాటే 2024 సంక్రాంతి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కూడా నిర్మాత ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ప్రాజెక్ట్ కెని సంక్రాంతికి అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు లేకపోలేదు. పుష్ప2ని కూడా సంక్రాంతికే లాక్ చేస్తే, దిల్ రాజు ఈ సినిమాను కూడా రెడీ చేయనున్నాడట. టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను దిల్ రాజు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని, ఊహించని గెస్టులను కూడా ఈ ఈవెంట్ కు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.













