రామ్ చరణ్, శంకర్ RC #15 మూవీలో సింగల్ సాంగ్ కి పాతిక కోట్లా?
ఆర్ఆర్ఆర్, ఆచార్య, తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ RC #15 షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే! 2023లో దీన్ని విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా భారీ బడ్జెట్ మూవీ RC #15 చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణను కూడా సినిమా పూర్తి చేసుకుంది. కాగా ఇందులో ఓ పాట కోసం పాతిక కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇందులో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా.. ముఖ్యమంత్రిగా కనిపిస్తారనే వార్తలు కూడా వినిపించాయి.
లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ పాటను తనదైన స్టైల్లో హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించడానికి శంకర్ ప్లాన్ చేశారట. కేవలం ఈ పాట కోసమే దాదాపు పాతిక కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ సినిమా అంటే మేకింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఖర్చు కూడా భారీగానే పెట్టిస్తారు మరి. అయితే పాటకు పాతిక కోట్లు ఖర్చు పెట్టడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ పాటకు వర్క్ చేయబోతున్నారని అందుకే ఆ రేంజ్లో ఖర్చు అవుతుందని సమాచారం. రీసెంట్గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను రూ.200 కోట్లకు జీ స్టూడియోకు దిల్ రాజు అమ్మేసినట్లు కూడా వార్తలు హల్ చల్ చేశాయి. అలాగే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ దిల్ రాజు ఓ డిసిషన్ తీసేసుకున్నారట. వచ్చే ఏడాది అంటే 2023 సంక్రాంతికి రామ్ చరణ్, శంకర్ సినిమాను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు దిల్ రాజు.













