వాయిదా దిశగా ధనుష్ రాయన్?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తన స్వీయ దర్శకత్వలో నటిస్తున్న సినిమా రాయన్. ఈ సినిమా రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొంది. ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా వస్తున్న రాయన్ ను జూన్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ డిసైడయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే రాయన్ చెప్పిన తేదీకి వచ్చేట్లు కనిపించడం లేదు. రాయన్ ను ఎలాగైనా జూన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఎంతగానో ట్రై చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. కానీ తాజా పరిస్థితులను చూస్తుంటే జూన్ 13న రాయన్ రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. సాంగ్ రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ చేస్తూ హడావిడి చేసిన రాయన్ చిత్ర బృందం, రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ ప్రమోషన్స్ చేయడం లేదు.
దీంతో సినిమా జులై లేదా ఆగస్ట్ కు వాయిదా పడే ఛాన్సుందని తమిళ మీడియా వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా సరైన సినిమాలు లేక వెలవెలబోతున్నాయి. జూన్ లో అయినా ధనుష్ సినిమా వస్తుందిలే అనుకుని వెయిట్ చేసిన వారికి నిరాశ తప్పేలా లేదు. భారీ అంచనాలతో రూపొదుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాయన్ రిలీజ్ డేట్ విషయంలో మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.













