రాయలసీమ లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ విడుదల
హాస్య చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం మోషన్ పోస్టర్ని, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఏవన్. ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ దర్శకునిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మిస్తున్నారు. వెంకట్ హీరోగా పరిచయం అవుతున్నాడు. హృశాలి గోసవి హీరోయిన్గా నటిస్తోంది. పావని మరో హీరోయిన్గా నటిస్తోంది. నాగినీడు, నల్లవేణు, పృథ్వీ, జీవా, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు, మధుమణి ఇతర ముఖ్య పాత్రధారులు. రాయలసీమ లవ్‌స్టోరీ టైటిల్లో మ్యాజిక్ ఉందని, యువతు నచ్చేలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందని ఫస్ట్‌లుక్ ఆవిష్కరించిన జి.నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన చిత్రమిది. మంచి పాటలున్నాయి. ఎలేందర్ అందించిన స్వరాలు ట్రెండ్ అవుతాయి అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ సినిమా బాగా వచ్చింది. యువతరం ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీయడం జరిగిందని అని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు.













