రా చిత్రం ఫస్ట్ లుక్ను విడుదల చేసిన త్రినాథ్
ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న రా చిత్రం ఫస్ట్ లుక్ను దర్శకుడు త్రినాథ్ నక్కిన విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రాజ్ డొక్కర మాట్లాడుతూ ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాం. సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. 25 రోజుల పాటు వైజాగ్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. రెండు పాటలు, రెండు ఫైట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసి, ఏప్రిల్లో సినిమా విడుదల చేస్తాం. సినిమాలో ఒక పాప ఉంది. ఆ పాత్రే సినిమాకు కీలకం అని తెలిపారు. ఈ చిత్రంలో నటించినందుకు హీరోలు మనోహర్, చంటి, హీరోయిన్ లోహిత ఆనందం వ్యక్తం చేశారు.













