పోటీ సినిమాకు వాయిస్ ఓవర్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న సినిమా హను మాన్. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ గా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. జనవరి 12న హను మాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో కోటి పాత్రకు వాయిస్ ఓవర్ అందించారు. టాలెంట్ ను ఎంకరేజ్ చేసే రవితేజ ఈసారి హను మాన్ టీమ్ చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకుని సపోర్ట్ అందిస్తున్నాడు. తన దాకా వచ్చి అడిగిన ప్రతి చిన్న సినిమాకూ రవితేజ సపోర్ట్ ఎప్పడూ ఉంటుంది.
అలా రవితేజ, హను మాన్ మూవీకి ప్లస్ కానున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి బరిలో హను మాన్ తో పాటూ రవితేజ నటించిన ఈగల్ కూడా రిలీజ్ కానుంది. ఓ వైపు తన సినిమాను రిలీజ్ చేస్తూనే, మరో సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రవితేజ లాంటి హీరోకే సాధ్యమని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. మరి హను మాన్ కు రవితేజ వాయిస్ ఏ మాత్రం ప్లస్ కానుందో చూడాలి.













