వెంకీ సినిమాలో స్టార్ క్యామియోలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో విక్టరీ వెంకటేష్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు నెట్టింట వార్తలొచ్చాయి. దీని గురించి ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారమివ్వలేదు కానీ పక్కా న్యూస్ అనే అంటున్నారు.
ప్రస్తుతం చిత్ర యూనిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం క్రేజీ క్యాస్టింగ్ ను సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని టాక్. ఇప్పటికే మీనాక్షి కథ విని ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మల్టీ స్టారర్ క్యామియోలు ఉండనున్నట్లు లేటెస్ట్ గా అప్డేట్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో రవితేజ, బాలకృష్ణతో కొన్ని నిమిషాల పాటూ కనిపించే స్పెషల్ క్యారెక్టర్లు డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. అనిల్ రావిపూడితో ఈ ఇద్దరు హీరోలకు మంచి అనుబంధం ఉండటం వల్ల తను అడగ్గానే ఓకే చెప్పినట్లు సమాచారం. కాబట్టి ఈ వార్త నిజమయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకుని సినిమాను మొదలుపెట్టనున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.













