రవితేజ కొత్త అవతారం ?
టాలీవుడ్ హీరోలంతా ఇటీవల నిర్మాతలుగానూ రాణిస్తారు. పారితోషికాలు, ప్యాకేజీలను పెట్టుబడులుగా పెడుతూ సినిమాలు చేస్తున్నారు. ముందే పారితోషికాలు తీసుకోకుండా వాటిని పెట్టుబడిగా మళ్లించడం అన్న ఆనవాయితీ కొందరు హీరోలకు అలవాటైంది. పారితోషికాలను పెట్టుబడిగా పెట్టి లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా ఇదే బాటలో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అగ్రిమెంట్‌కు ముందు పైసా తీసుకోకుండా తన పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టి నిర్మాత కాబోతున్నారట. అలాగే సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి అందులో పరిమిత బడ్జెట్లో సినిమాలు నిర్మించి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నారట. రవితేజకు ఈ రెండు ఆటలోచనలు ఉన్నాయని తెలిసింది.













