ఖిలాడీ రవితేజ డ్యూయల్ రోల్స్ ఏంటంటే..
వరుస ఫ్లాపులతో కెరీర్ డల్ గా సాగుతున్న టైమ్ లో మాస్ రాజా రవితేజ కు క్రాక్ ఇచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఒక ఊపు ఊపింది. సీటింగ్ కెపాసిటీ 50% ఉన్న టైమ్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టింది. క్రాక్ ఇచ్చిన బూస్టింగ్ తో ఫామ్ లోకి వచ్చిన రవితేజ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఖిలాడీ మూవీ షూటింగ్ తో బిజీగా రవితేజ నుంచి వస్తున్న తర్వాతి సినిమా కావడంతో ఖిలాడీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని ఇప్పటికే ఆ నోటా ఈ నోటా వచ్చి, బయట పడింది కానీ ఆ క్యారెక్టర్స్ ఏంటన్నది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా రవితేజ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే గతంలో రవితేజ, రమేష్ వర్మలు వీర అనే సినిమా చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఖిలాడీ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.













