త్రినాథరావు సినిమాలో రవితేజ ఎలా కనిపిస్తాడంటే..
మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ డైరక్షన్ లో ప్రస్తుతం ఖిలాడీ చేస్తున్న రవితేజ.. రీసెంట్ గా ఇటలీ వెళ్లి, షూటింగ్ ఇంకా కొంచెం పెండింగ్ ఉండగానే కరోనా ఎక్కువవుతున్న కారణంతో షూటింగ్ కు బ్రేక్ పడిందంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రవితేజ తర్వాతి చిత్రం త్రినాథరావు నక్కిన తో చేయనున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో రవితేజను ఘరానామొగుడు రేంజ్ లో చూపించనున్నారనే వార్త తెగ వినిపిస్తుంది. రొమాన్స్, యాక్షన్ తో రవితేజ మైమరిపించే సీన్స్ లో రవితేజ అదరగొట్టనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనుల్లోనే త్రినాథరావు ఉన్నాడని తెలుస్తుంది.
మునుపెన్నడూ కనిపించనంత ఎనర్జిటిక్ గా రవితేజ ఈ సినిమాలో కనిపించనున్నాడి, తనలోని మాస్ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో నక్కిన ప్లాన్ వేశాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాతో అటు రవితేజ, ఇటు త్రినాథరావు లు ఇద్దరూ హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట.













