Ravi Teja: సూపర్ హీరో గా రవితేజ?
జయాపజయాలను పట్టించుకోకుండా మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గతేడాది ఈగల్(Eagle), మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ఆ సినిమాలతో డిజాస్టర్లను అందుకున్నాడు. ప్రస్తుతం రవితేజ సితార బ్యానర్(Sithara Entertainments) లో మాస్ జాతర(Mass Jathara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత రవితేజ కిషోర్ తిరుమల(Kishore Tirumala)తో ఓ సినిమాను చేయనుండగా, మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో ఇంకో సినిమాను చేయనున్నాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్ శంకర్- రవితేజ కాంబోలో రానున్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇప్పుడు బయటికొచ్చింది. ఈ అప్డేట్ ను స్వయంగా నిర్మాత నాగవంశీనే ఇచ్చాడు.
రవితేజతో కళ్యాణ్ శంకర్ చేయబోయే సినిమా సూపర్ హీరో జానర్ లో సోషియో ఫాంటసీ డ్రామాగా ఉంటుందని చెప్పి రవితేజ ఫ్యాన్స్ కు షాకిచ్చాడు నాగవంశీ(Naga Vamsi). రవితేజ సూపర్ హీరో గా కనిపించనున్నాడని ఓ వైపు ఫ్యాన్స్ సంతోషిస్తున్నప్పటికీ, అలాంటి జానర్‌ను, రవితేజ లాంటి మాస్ హీరోను కళ్యాణ్ ఏ మేరకు హ్యాండిల్ చేయగలడని అనుమాన పడుతున్నారు.













