రవితేజ సరసన శ్రుతిహాసన్
తెలుగు, తమిళ భాషల్ల నాజూకు కథానాయికగా శ్రుతిహాసన్‌కి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోను ఆమె స్టార్ హీరోలతో నటించింది. ఇక్కడ కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలోనే ప్రేమలో పడి కెరియర్‌పై శ్రద్ధ పెట్టడం మానేసింది. ఫలితంగా ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. ప్రేమ కూడా విఫలమైపోయింది. దాంతో తిరిగి ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమా కోసం గోపీచంద్ మలినేని ఆమెను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా చేయడానికి శ్రుతి హాసన్ అంగీకరించిదనేది తాజా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన బలుపు విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.













