రవితేజ సరసన శ్రుతిహాసన్ ?
రవితేజ, శ్రుతిహాసన్ జోడీ బలుపు చిత్రంతో ఆకట్టుకుంది. రవితేజ శైలి మాస్ అంశాలకి శ్రుతిహాసన్ అందచందాలు తోడవ్వడంతో ఆ చిత్రం ప్రేక్షకులకి వినోదం పంచింది. విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరూ. ఆ కలయికలో మరో చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. బలుపు ను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రవితేజ ఇటీవల అంగీకారం తెలిపారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఆ సినిమాలో నాయికగా శ్రుతిని ఎంపిక చేసుకొనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. కాటమరాయుడు తర్వాత శ్రుతి తెలుగులో సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా సంగీతంపైనే దృష్టి పెట్టిన ఆమె ఇటీవల తమిళంలో ఓ చిత్రం కోసం రంగంలోకి దిగింది. తెలుగులోనూ సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా చిత్రంతో బిజీగా గడుపుతున్నారు.













