క్రాక్ జోరుతో సినిమాలను లైన్ లో పెడుతున్న మాస్ రాజా
క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ ఎలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడో, ఏ డైరక్టర్ తో సినిమా చేస్తాడో అని అందరూ అనుకుంటుండగా తన 68వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మతో ఖిలాడీ సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన తో కలిసి సెట్స్ మీదకు వెళ్లనున్నాడు రవితేజ.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రినాథరావు రవితేజ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందట. ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రం.. రవితేజ ప్రస్తుతం చేస్తున్న ఖిలాడీ పూర్తవగానే మొదలుకానుందట. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడినుంచనుంది చిత్ర యూనిట్.













