డ్యూయాల్ రోల్ లో రవితేజ
రవితేజ కథానాయకుడిగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇందులో రవితేజ పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుందని, ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని చెబుతున్నారు. కథానుగుణంగా ఆయన పాత్ర చిత్రణలో ప్రతినాయక ఛాయలు కనిపిస్తాయని తెలిసింది. గతంలో రవితేజ విక్రమార్కుడు, దరువు కిక్-2 డిస్కో రాజా చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో కనిపించారు. మరోమారు ఆయన డ్యూయల్ రోల్‌ను పోషిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రాన్ని కోనేను సత్యనారాయణ నిర్మించనున్నారు.













