రవితేజ తో మారుతి సినిమా.. ఈసారైనా వర్కవుటయ్యేనా..?
ఇటీవల ఒక కాంబినేషన్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడిచింది. అదే మాస్ మహారాజ్ రవితేజ, మారుతి కాంబినేషన్ గురించి. ఈ కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ ఓకే అయిందన్న ప్రచారం కూడా సాగింది కానీ లాస్ట్ మినిట్ లో రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఆశ్చర్యపరిచింది. రెమ్యూనరేషనే దానికి రీజన్ అని కూడా ప్రచారమైంది.
దాని తర్వాత రవితేజ ప్లేస్ లో గోపీచంద్ చేరారు. పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఫస్ట్ షెడ్యూల్ కూడా రీసెంట్ గానే పూర్తి చేసుకుని నెక్ట్స్ షెడ్యూల్ కు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు యూనిట్. జీఏ2, యువీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాను అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
అయితే రీసెంట్ గా మళ్లీ మరోసారి మారుతి రవితేజను కలిశారని, వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలుస్తుంది. మారుతి ప్రస్తుతం ఒక వైపు పక్కా కమర్షియల్ ఫినిష్ చేస్తూనే మరో వైపు రవితేజ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఇదిలా ఉంటే రవితేజ కూడా ఖిలాడీ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. తర్వాత త్రినాధ రావు నక్కిన తో సినిమా చేయనున్నారు. మారుతి స్క్రిప్ట్ కూడా రెడీ అయితే వెంటనే సినిమాను కూడా స్టార్ట్ చేసేస్తారట. బహుశా వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.













