హిట్ కాంబోకి బ్రేకులు
టైగర్ నాగేశ్వరరావుతో రీసెంట్ గా ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ, ఆ సినిమాతో అనుకున్న విధంగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తన తర్వాత సినిమాపైనే రవితేజ ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేనితో రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈగల్ తర్వాత రవితేజ కొత్తగా స్టార్ట్ చేయబోయే సినిమాకు ఇప్పుడు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తనకు కెరీర్లో ఇప్పటికే మూడు హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో రానున్న మూవీ ఈ గురువారం షూటింగ్ మొదలు కావాల్సింది కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా తాత్కాలికంగా ఆగినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అవుతుందనే కారణంతో మళ్లీ కొత్త ప్లాన్ తో ముందుకెళ్లాలని అప్పటివరకు సినిమాను పాజ్ చేసినట్లు సమాచారం. స్టార్ట్ చేసిన తర్వాత మళ్లీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఎందుకు డిలే చేయడం అని, ముందుగానే ఓ ప్లాన్ ప్రకారం సినిమాను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













