జాతిరత్నం కు మాస్ మహారాజ మూవీ లో ఆఫర్
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తన అందం, నవ్వు, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. ఏకంగా ప్రభాస్ లాంటి వాడే తన హైట్ కు కంగారు పడ్డాడు. అనూహ్యంగా వెండితెరపైకి దూసుకొచ్చిన ఫరియాను నాగ్ అశ్విన్ ఒక కాలేజ్ ఈవెంట్ లో చూసి జాతి రత్నాలు లో ఆఫర్ ఇచ్చాడు. చేసిన మొదటి సినిమాతోనే అందరి మనసుల్ని గెలుచుకున్న ఈ తెలుగమ్మాయి టాలీవుడ్ లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, రవితేజ కొత్త సినిమాకు సైన్ చేయడానికి ఫరియా డిసైడ్ అవుతుందట. హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సైన్ అయితే చేయలేదు ఫరియా.
జాతిరత్నాలు లోని చిట్టి అనే ఫేమస్ సాంగ్ చూశాకే రవితేజ ప్రొడ్యూసర్స్ ఫరియాకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. చూస్తుంటే ఈ జాతిరత్నం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవడం ఖాయమనే అనిపిస్తుంది. తన హైట్ కు ఫిదా అయిపోయిన ప్రభాస్ కూడా తనకు ఏమైనా ఆఫర్ ఇస్తాడేమో చూడాలి. అదే జరిగితే ఫరియా పాన్ ఇండియన్ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లే అవుతుంది. చూడాలి మరి తన లక్ ఎలా ఉందో..













