రవితేజ సరసన మరో నాయిక ఎవరు ?
రవితేజ కథానాయకుడిగా ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం డిస్కోరాజా. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలు. రామ్ తాళ్లూరి నిర్మాత. రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అందులో భాగంగా రామోజీ ఫిలింసిటీలో రవితేజ, వెన్నెల కిషోర్‌లపై కొన్ని కీలకమైన హాస్య సన్నివేశాల్ని తెరకెక్కించారు. అనంతరం హైదరాబాద్ శివార్లలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. సైన్స్‌తో ముడిపడిన అంశాలతో ఓ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు ఆడి పాడనున్నారు. ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేయగా, మరో నాయిక కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తోంది. బాబీ సింహా, సత్య, సునీల్ తదితరులు నటిస్తున్నారు. సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని.













